- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిలింనగర్ లో మళ్ళీ గంజాయి చప్పుడు..
దిశ,బంజారాహిల్స్: పోలీసుల కన్ను గప్పి చాటుగా మత్తు పదార్ధాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్–3లో నివాసం ఉండే మహ్మద్ మహబూబ్ అలీ అలియాస్ షూటర్(33), ఎండీ.సర్ఫరాజ్(19) అనే ఇద్దరు యువకులు కలిసి గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం నిషేదిత మత్తు పదార్థాలను అమ్మాలని నిర్ణయించుకుని మహ్మద్ హాజీ అనే వ్యక్తితో కలిసి విశాఖపట్నం వెళ్లి అక్కడ గంజాయి ద్రావణాన్ని కొనుగోలు చేశారు. అక్కడినుంచి వచ్చి ఫిలింనగర్ కొత్త చెరువువద్ద నిలబడి అవసరం అయిన వారికి అమ్ముతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి మహబూబ్ అలీ, సర్ఫరాజ్‌లను అరెస్ట్‌చేసి వారివద్ద నుంచి 72 ప్యాకెట్ల గంజాయి ద్రావణం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
సీఎం ఆదేశాలు అమలయ్యేనా?
రాష్ట్రంలో గంజాయి సాగు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోజే భారీ స్థాయిలో గంజాయి పట్టుపడటం గమనార్హం. గంజాయి విక్రయ దారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎప్పుడు చెప్పే పోలీసుల మాటలు వట్టి మాటలేనా అనే సందేహం కలగదు. ఎందుకంటే , ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖపట్నం నుండి యథేచ్ఛగా భాగ్యనగరానికి గంజాయి సరఫరా చేస్తున్న గాని పోలీసులకు పట్టుపడకపోవడం ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.
గత నెలలో సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిని హత్యాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనికి కారణమైన నిందితుడు రాజు గంజాయి వ్యసనానికి అలవాటు పడ్డాడని, చిన్నారి హత్యాచార ఘటనకు రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా జరిగే గంజాయి విక్రయాలు పరోక్ష కారణమని సామాజిక కార్యకర్తలు, మహిళ సంఘాల నేతలు ఆరోపించారు. ఏదైనా సంఘటన జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి మిగతా రోజులు మిన్నకుండిపోడం పోలీసులకు పరిపాటిగా మారిందా అని సందేహం కలుగుతోంది. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు అమలవుతాయో వేచి చూడాలి.