- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంతల్లో బండి నడిపితే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు..!
దిశ, ఆర్మూర్: మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా..? అయితే ఎలాంటి సాధన అవసరం లేకుండా ఆర్మూరు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లండి.. ఔను, ఆర్టీఏ అధికారులు లైసెన్స్ జారీ చేసే ముందు దరఖాస్తుదారులకు టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఓ మైదానం పరిస్థితి అలాగే ఉంది. తిన్నగా ఆ మైదానంలోకి వాహనం పోనిచ్చి అక్కడి గుంతల మధ్య నుంచి కూడా నెమ్మదిగా దాటేసి.. చెట్టు కింద కూర్చున్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ముందు వాహనం నిలిపితే సరిపోతుంది. ఇంతకు మించి ఎలాంటి పరీక్షలు అవసరం లేదేమో అనిపిస్తోంది..! ఎందుకంటే ఆ మైదానం పరిస్థితి అలా ఉంది మరి. టెస్ట్ డ్రైవ్ కోసం వచ్చేవారు ఈ గుంతలను దాటుకుని రావాల్సిందేనని అధికారులు భావిస్తున్నారా.. అన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.
చిట్టడవిని తలపిస్తున్న మైదానం..
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవారికి లైసెన్స్ జారీ చేసేందుకు ఆర్టీఏ అధికారులు వాహనం నడపడంలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఆర్మూర్ ఆర్టీఏ అధికారులు కార్యాలయం పక్కనే ఓ మైదానాన్ని ఎంచుకున్నారు. అయితే, ఆ మైదానం చిట్టడవిని తలపిస్తున్నది. మైదానం నిండా పిచ్చి మొక్కలు, బురద, గుంతలు దర్శనమిస్తున్నాయి. బురద గుంతల్లో వర్షం నీరు నిలిచి దుర్గంధభరితంగా మారింది. ఈ బురద గుంతల మధ్య టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తుండడంతో కొత్తగా వాహనం నడపడం నేర్చుకున్న వారు కూడా కంగారు పడుతున్నారు. అధికారులు ముందు నడపడమంటేనే భయపడిపోయేవారు. ఈ గుంతలను చూసి జంకుతున్నారు. దీనిపై ఆర్టీఏ అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయించాలని వాహనదారులు కోరుతున్నారు.