- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జడ్చర్లలో జోరుగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు
దిశ, జడ్చర్ల : పురపాలక ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా పట్టణంలోని పలు వార్డులకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్లు వేయడానికి భారీర్యాలలతో నామినేషన్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం లోని మొదటిసారిగా 27 వార్డులతో కలిపి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నేడు నామినేషన్ల చివరి రోజు సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు,కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటి చేస్తూ ర్యాలీలు, మేళతాళాలతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. మరోవైపు నామినేషన్ కేంద్రం వద్ద కరోనా నిబంధనలు పాటించే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో సంబంధిత అధికారులు కరోనా జాగ్రత్తలను అనుసరిస్తూ నామినేషన్లను స్వీకరిస్తున్నారు.. నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఆదేశించారు.