- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊరికి వెళ్లొచ్చే లోగా.. మొత్తం ఊడ్చేశారు
దిశ, వెబ్‌డెస్క్ : ఊరికి వెళ్లొచ్చే సరికి దొంగలు ఇళ్లంతా ఊడ్చేశారు . ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కోటి రూపాయల సొత్తును దర్జాగా కొట్టేశారు. తీరుబాటుగా వచ్చిన ఇల్లాలుకు ఇంటి తలుపులు విరిగి, సామగ్రి చిందరవందరగా పడి ఉండడం కనిపించింది. దీంతో ఆమె గందరగోళానికి గురైంది. వెంటనే తేరుకున్న ఆమె.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే…?
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజేశ్వరి(70).. ఈనెల 19న హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుడి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు వెళ్లింది. తిరిగి 23న ఇంటికి చేరుకుంది. ఆమె వచ్చే సరిగి తలుపులు విరిగిపడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు, దుస్తులు మంచంపై పడేసి ఉన్నాయి. బీరువాలో వెతకగా.. బంగారు, వెండి నగలతోపాటు నగదు కనిపించలేదు. వెంటనే రాజేశ్వరి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఘటనా స్థలాన్ని ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ పరిశీలించి, వేలిముద్రలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేజీ బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు అంచనాకు వచ్చామని తెలిపారు. వాటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు. నేరస్తులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ నాగప్రసాద్ పేర్కొన్నారు.