చవితి రోజే వినాయకుడి విగ్రహం చోరీ

by Anukaran |   ( Updated:2020-08-22 03:27:47.0  )
చవితి రోజే వినాయకుడి విగ్రహం చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆ వినాయక విగ్రహానికి కొన్ని వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. అందుకే ఆ ఆలయంలో ఆ విగ్రహానికి స్పెషల్ గా చూస్తారు. కానీ, ఆ విగ్రహంపై కొందరి దుండగులు కన్ను పడింది. భక్తుల రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశీల సోమేశ్వరాలయం ఉన్నది. ఈ అతి పురాతనమైన శివాలయం జలాశయంలో ఉంటది. ఈ ఆలయంలోనే కొన్ని వందల ఏళ్లనాటి వినాయక విగ్రహం ఉంది. అయితే, ఈ విగ్రహాన్ని శనివారం దుండగులు ఎత్తుకుళ్లారు. భక్తుల రూపం వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు ఆలయ పూజారి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story