రాజమండ్రిలో దొంగల కలకలం

by srinivas |
రాజమండ్రిలో దొంగల కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలపాటు నెమ్మదించిన దొంగలు మళ్లీ పంజా విసురుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఇటీవల పాజిటివ్‌తో మరణించిన వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.6 లక్షల నగదు, 16 కాసులు బంగారం, 10 కిలోలు వెండిని దుండగులు అపహరించారు. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి వచ్చి దోపిడీని గుర్తించిన మృతుడి భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story