సింగరేణి కార్మికుడి ఇంట్లో చోరీ

by Aamani |
Theft
X

దిశ, క్యాతన్‌పల్లి : ఆస్పత్రికి వెళ్లి వచ్చే సరికి ఇల్లును గుల్లా చేశారు దొంగలు. ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లారు. రామకృష్ణాపుర్‌లో సింగరేణి కార్మికుడి ఇంట్లో జరిగిన ఈ చోరీ వివరాలను మందమర్రి ఏరియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ రావు సోమవారం వెల్లడించారు.

రామకృష్ణాపుర్ పట్టణంలో భగత్ సింగ్ నగర్‌కు చెందిన ఐలవేని లింగయ్య సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 24న ఆయన తల్లి అనారోగ్యం పాలుకావడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేర్పించి చికిత్స చేయించాడు. అనంతరం తిరిగి ఆదివారం ఇంటికి రాగా ఇంట్లో వస్తువులు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళం పగలగొట్టి దాంట్లో ఉన్న రూ.94 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే లింగయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మందమర్రి ఏరియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ రావు సంఘటనా చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారానలు సేకరించింది. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed