సిద్దమవుతున్న థియేటర్లు

by Shyam |
సిద్దమవుతున్న థియేటర్లు
X

దిశ, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమలవుతోంది. అప్పట్నుంచి థియేటర్లు మూతపడే ఉన్నాయి. ఇప్పటి వరకూ విధించిన 5 లాక్ డౌన్ ప్రకటనలో థియేటర్లను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఎప్పుడు లభిస్తుందా అంటూ థియేటర్ల మేనేజ్మెంట్, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వంలోని మంత్రులు, పెద్దలతో ఒక దఫా చర్చలు నిర్వహించిన సంగతి తెల్సిందే. సినిమా థియేటర్లలో జనం రద్దీ విపరీతంగా ఉంటున్న కారణంగానే ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వడం లేదు. అయితే, సినీ పరిశ్రమలో ఇప్పటికే ఓటీటీ పద్దతిపై సినిమాలను చూసే సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఈ లాక్ డౌన్ సమయంలో భవిష్యత్తులో ఓటీటీ నే దిక్కవుతుందా అనే చర్చ కొనసాగుతోంది. అయితే, థియేటర్ల అనుమతికి ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి మార్గదర్శకాలు విడుదల కాకున్నా.. నగరంలోని కొన్ని థియేటర్లు మాత్రం భవిష్యత్ పరిస్థితులను ఊహించుకుంటూ సీటింగ్ సిస్టమ్ ను భౌతిక దూరానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనల నుంచి థియేటర్లకు సడలింపులు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే భౌతిక దూరం పాటిస్తూ.. షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో ఇక త్వరలోనే థియేటర్లకు కూడా అనుమతి లభిస్తోందనే ఆశాభావాన్ని థియేటర్ల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed