షాకింగ్: అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లెలు ఆత్మహత్య..

by Anukaran |   ( Updated:2021-08-22 08:51:09.0  )
షాకింగ్: అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లెలు ఆత్మహత్య..
X

దిశ ప్రతినిధి, మెదక్: పండుగపూట విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగాన్ని మిగల్చాల్సిన పండుగ వారింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ప్రేమగా అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లెళ్లకు అవమానం ఎదురైంది. దీంతో ఇంట్లోకి వెళ్లి ఓ చెల్లెలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు.. బసన్న కుమార్తె మమత (22) అన్న రమేష్ కు రాఖీ కట్టేందుకు వెళ్లగా, అన్న కట్టుకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story