షాకింగ్.. సొంత అన్నను దారుణంగా చంపిన తమ్ముడు

by Sumithra |
షాకింగ్.. సొంత అన్నను దారుణంగా చంపిన తమ్ముడు
X

దిశ, చేవెళ్ల : ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడి కొట్టుకున్న ఘటనలో అన్న మృతి చెందాడు. ఈ దారుణ ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చేవెళ్ల సర్కిల్ ఇన్స్‌పెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన దివిటి ఎల్లయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అశోక్ (38) చిన్న కుమారుడు రాజు. అయితే, ఇంటి ముందున్న ఖాళీ స్థలం విషయంలో గత కొంత కాలంగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది.

కాగా ఇటీవల ఇంటి ఖాళీస్థలం విషయమై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇద్దరు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూనే ఉన్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం తమ్ముడు రాజు తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కర్రలు పాతేందుకు గుంతలు తవ్వుతుండగా అన్న అశోక్ గుంతలు ఎందుకు తవ్వుతున్నావ్ అంటూ ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కోపానికి గురైన తమ్ముడు రాజు బండరాయితో అన్న అశోక్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు.

దీంతో సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి హత్యకు పాల్పడిన రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story