- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!
దిశ, పాలకుర్తి : తమ్ముడూ అంటూ ఓ యువతి తన స్నేహితురాలి సోదరుడితో చేసుకున్న పరిచయం అతడి ప్రాణాలు తీసింది. తమ్ముడు.. తమ్ముడు అంటూనే ప్రేమలోకి దింపి మూడుముక్కలాట ఆడింది. ఒక్కతే యువతి మూడు పేర్లు, మూడు నంబర్లతో గొంతు మార్చి ముగ్గురం ప్రేమిస్తున్నాం అంటూ సినిమా ట్విస్ట్‌లు ఇస్తూ ప్రేమాయణం కొనసాగించింది. అయినా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోని వెళ్లిపోయి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి యువకుడిని బలితీసుకుంది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ కన్నింగ్ ప్రేమ కథ వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆర్ఆండ్ఆర్ కాలనీ(మొరిపిరాల) గ్రామానికి చెందిన యువకుడు (22) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషన్‌గా పని చేస్తున్నాడు. తన సోదరితో చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువతి అతడిని ఫోన్‌లో పరిచయం చేసుకుంది. తన మాయ మాటలతో ఆ యువకుడు ప్రపంచాన్ని మరిచి తన ప్రేమలో పడేలా చేసింది. తన మత్తులో మునిగాడని గుర్తించిన యువతి మరో నాటకానికి తెరలేపింది. ఆమె మరో ఇద్దరు అమ్మాయిల్లాగా కావ్య, మనీషా పేర్లతో గొంతు, ఫోన్ నెంబర్ మార్చి ప్రేమికుడితో మాట్లాడటం ప్రారంభించింది. నేను ప్రేమిస్తున్నాను అంటే నేను ప్రేమిస్తున్నానని యుకువడితో నాటకం ఆడింది. అయినా సదరు యువకుడు నేను మొదటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేశాడు.
ఈ క్రమంలో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అయినా ప్రేమికుడిని వదలని ఆ కన్నింగ్ కంత్రీ యువతి మరో నాటకానికి తెరతీసింది. గొంతు మార్చి.. కావ్య, మనీషాల మాట్లాడింది. నీ మొదటి ప్రియురాలికి పెళ్లి అయింది కాబట్టి తనను పెళ్లి చేసుకోవాలని ఇద్దరి యువతుల మాదిరిగా మాట్లాడుతూ వేధించడం ప్రారంభించింది. ఇలా ఆరు నెలలుగా ఇబ్బంది పెట్టినా యువకుడు పట్టించుకోలేదు. దీంతో ప్లాన్ మార్చిన యువతి.. ‘‘నీ మీద ప్రేమతో నీ లవర్ భర్తను వదిలేసి వచ్చింది.. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలని’’ మనీషా, కావ్యల పేరుతో మరో ట్రిక్కు ప్లే చేసింది. అయితే పెళ్లైన ఆమెను తాను పెళ్లి చేసుకోనని సదరు యువకుడు తేల్చి చెప్పేశాడు. అయితే ‘‘స్రవంతి ఆత్మహత్య చేసుకుందని’’ మనీషా, కావ్యల పేరుతో సమాచారం అందించింది.
అయితే ఆమె చనిపోయిందని భయడిపోయిన యువకుడు ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు గురువారం మృతి చెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడు తమ్ముడు అంటూనే ప్రేమలోకి దింపింది..
‘‘నా తమ్ముడికి పరిచమైన అమ్మాయి.. తమ్ముడు తమ్ముడు అంటూ రెండు కాంటాక్టు నెంబర్లు ఇచ్చింది. వీళ్లతో మాట్లాడు నీకు సరిపోతారని చెప్పింది. ఆ తర్వాత ప్రేమలోకి దింపింది. మా తమ్ముడు పురుగుల మందు తాగిన రెండు రోజుల తర్వాత ఈ విషయాలు చెప్పాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’’. అని యువకుడి సోదరుడు తెలిపాడు.
నేను బిజీ.. మళ్లీ చేస్తా
యువతి ప్రేమ నాటకం, యువకుడి ఆత్మహత్య ఈ విషయంపై రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను ‘దిశ’ విలేకరి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించాడు. స్టేషన్ అధికారికి రెండ్ సార్లు ఫోన్ చేయగా ‘‘నేను బిజీగా ఉన్నాను. మళ్లీ చేస్తా’’నని చెప్పారు. కాగా, ఈ కేసుపై ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా స్పందించలేదు.
Read more:
అత్యాచారం చేయలేదు.. ఇద్దరం శారీరకంగా కలిశాం అంతే..!
- Tags
- crim