ప్రేమకోసం.. యువకుడు, యువతిని ఏం చేశాడంటే ?

by Sampath |   ( Updated:2021-06-18 21:48:30.0  )
ప్రేమకోసం.. యువకుడు, యువతిని ఏం చేశాడంటే ?
X

దిశ,వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువకుడు, యువతి గొంతుకోసి చంపిన ఘటన జిల్లాలోని చింతల చెరువు గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే.. శిరీష అనే యువతి బద్వేల్ పట్టణంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే చరణ్ అనే యువకుడు శిరీషని ప్రేమించాడు. అయితే తన ప్రేమకు శిరీష ఒప్పుకోలేదు. దీంతో చరణ్ శిరీష మీద కక్ష పెంచుకొని పథకం ప్రకారం ఆమె గొంతు కోసి హత్య చేశాడు. దాడి చేసి పారిపోతున్న అతన్ని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చరణ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story