సీఎం అపాయింట్మెంట్​ ఇస్తలేడని.. యువకుడు ఆత్మహత్యాయత్నం

by Shyam |   ( Updated:2021-10-30 06:29:51.0  )
సీఎం అపాయింట్మెంట్​ ఇస్తలేడని.. యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, చార్మినార్: సీఎం దృష్టిలో పడాలని.. సీఎం సార్​ నాకు అపాయింట్​ మెంట్​ ఇస్తలేడని ఓ యువకుడు ఐదు అంతస్థుల భవనం పైకి ఎక్కి మూడు గంటల పాటు హల్​చల్ చేశాడు. నేను బిల్డింగ్ పై నుంచి దూకుతానని హెచ్చరించడంతో మీర్​చౌక్​ డబిర్​పురా పోలీసులు ఆ యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని విఫలం చేశారు. వివరాల లోకి వెళితే.. నిజామాబాద్​ ఆర్మూర్​కు చెందిన నక్క చెంచు అశోక్​ (25) పాతబస్తీ మీర్​ చౌక్​ ప్రాంతంలోని ఎంజీబిఎస్​ కు ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఐదంతుస్థుల భవనం పైకి శనివారం తెల్లవారు జామున 5గంటలకు ఎక్కాడు. పై నుంచి కిందికి దూకుతానని బెదిరించసాగాడు. దాదాపు మూడు గంటల పాటు నానా హంగామా చేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మీర్​చౌక్​, డబిర్​పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కింద కొంతమంది పోలీసులు వల పట్టుకుని ఉండగా మరి కొంత మంది పోలీసులు చాకచక్యంగా అతన్ని మాటల్లో పెట్టి నిర్మాణంలో ఉన్న ఐదంతుస్థుల భవనం పైకి వెళ్లారు. అశోక్​ను పోలీసులు పట్టుకుని అతని ఆత్మహత్యాయత్నాన్ని విఫలం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో అశోక్​ కేసీఆర్​ జిందాబాద్.. బీజేపీ డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశాడు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని బాధలు చెప్పుకోవడానికి వస్తే ఎవరు పట్టించుకోవడంలేదని, సీఎం అపాయింట్​ మెంట్​ కూడా ఇవ్వడం లేదని, సీఎం దృష్టిలో పడటానికి ఇదంతా చేశానని పొంతలేని సమాధానాలు చెప్పాడు. దాంతో అశోక్​ కు పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చారు. అతని తల్లి దండ్రులకు పోలీసులు సమాచారాన్ని అందజేశారు. అశోక్​ను వారి తల్లి దండ్రులకు అప్పగించనున్నట్లు మీర్​ చౌక్​ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed