కరోనాతో యువకుడు మృతి

by Shyam |
కరోనాతో యువకుడు మృతి
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన బీసు రవి(35) బుధవారం కరోనాతో మృతి చెందాడు. గత వారం రోజులుగా కరోనా మూలంగా అనారోగ్యం పాలై భాదపడుతుండగా, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మానుకోట ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వికలాంగుడైన మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Advertisement
Next Story

Most Viewed