ప్రపంచంలోనే ఎత్తైన హోటల్.. ఎక్కడంటే?

by vinod kumar |   ( Updated:2021-04-22 03:21:43.0  )
World’s Tallest Tower
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే పొడవైన, అత్యద్భుత కట్టడంగా పేరుగాంచిన దుబాయ్‌లోని ‘బుర్జ్ ఖలీఫా’ గురించి అందరికీ తెలుసిందే. వివిధ రంగాల్లో ప్రముఖుల కృషిని కొనియాడుతూ బుర్జ్ ఖలీఫా‌పై వారి చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ‘ఎమిరేట్స్’.. సియోల్ టవర్ దగ్గరలో ‘దుబాయ్ మెరినా’ పేరుతో హోటల్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ యహ్య జాన్ డిజైన్ ఇవ్వగా, ఇదొక అత్యద్భుత నిర్మాణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా 365 మీటర్ల ఎత్తులో ఉండేలా ఈ హోటల్‌కు డిజైన్ ఇవ్వడం ఆనందగా ఉందని, తన కెరీర్‌లో ఇది అతిపెద్ద చాలెంజింగ్ ప్రాజెక్టు అని ఆర్కిటెక్ట్ తెలిపాడు.

Next Story

Most Viewed