అమెజాన్ సంస్థకు షాకిచ్చిన మహిళలు..

by Shyam |   ( Updated:2021-07-31 04:21:21.0  )
Thakkallapalli Power Plant
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఓ ప్రైవేట్ సంస్థ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాలా అంటూ గ్రామస్తులు ఆందోళన బాటపడ్డారు. గ్రామం మధ్యలో నుంచి వెళ్తున్న విద్యుత్ టవర్లను పెకిలించేశారు. దీనిపై గతకొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం శనివారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం మీర్‌ఖాన్‌పేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Power Towers

ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ అమెజాన్ మీర్‌ఖాన్‌పేటలో భారీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీని అవసరాల కోసం తక్కళ్లపల్లి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. దీనికిగాను అధికారులు 33 కేవీ టవర్లు నిర్మిస్తున్నారు. ఆ విద్యుత్ టవర్లు తక్కళ్లపల్లి గ్రామం నుంచి వెళ్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక పవర్ ఉండే టవర్లతో ప్రమాదాలు జరుగుతాయని అడ్డుకుంటున్నారు. అయినా అధికారులు పోలీస్ బందోబస్త్ నడుమ రెండు రోజులుగా టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. కాగా, శనివారం ఉదయం గ్రామంలోని మహిళలు ఏకమై అధికారులు నిర్మించిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు. టవర్లు నిర్మించవద్దు.. ప్రాణాలు తీయవద్దని నినాదాలు చేశారు. తమ గ్రామం నుంచి ప్రమాదకరంగా విద్యుత్‌ను తరలించవద్దని కోరారు.

Advertisement

Next Story

Most Viewed