పోలీసులను పరుగులు పెట్టించిన మహిళలు.. ఎలా అంటే..!

by srinivas |
Tenali Police
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తెనాలిలో మహిళలు పోలీసులను పరుగులు పెట్టించారు. ఊరి చివర ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100 కు మహిళలు ఫోన్ చేశారు. ఫోన్ రాగానే త్రిటౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్ కాల్ రాగానే ఆగమేఘాల మీద నిమిషాల వ్యవధిలో త్రిటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రెండు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల వ్యవధిలో త్రిటౌన్ సీఐ కె.రాఘవేంద్ర చేరుకున్నారు. తీరా ఘటనా స్థలానికి చేరుకోగా జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్ అని తేలడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దిశ యాప్ ఆవశ్యకతను తెలియజేస్తూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అవగాహన కల్పిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Next Story