- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్గంమధ్యలో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం
by Shyam |
దిశ, నల్లగొండ: బతుకుదెరువు కోసం ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రాగువారిగూడెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబం ఒరిస్సా నుంచి ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చింది. గర్భిణిగా ఉన్న రీనాజ్ నాగ్ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందజేశారు. అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో నొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్‌ను పక్కకు ఆపి 108 వాహన సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. అనంతరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story