- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చావుబతుకుల మధ్య భర్త.. వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య
దిశ, వెబ్డెస్క్: కొన్ని కొన్ని విషాదాలు విన్నా, చూసినా మనసు తరుక్కుపోతుంటుంది. ఈ కరోనా సమయంలో అలాంటి విషాదాలు లెక్కలేనన్ని. చేతికంది వచ్చిన కొడుకు కళ్లముందే చనిపోయినప్పుడు, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భర్త ఏడాది కాకముందే మరణించినప్పుడు.. తల్లిదండ్రులు కరోనాకు బలై బిడ్డలు అనాథలుగా మారినప్పుడు, ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినప్పుడు.. ఇలా ఎన్నో విషాదాలు. ఈ కరోనా మిగిల్చిన విషాధ గాథలు వింటే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ భార్య విషాద గాధ అందరి గుండెలను కలిచి వేస్తోంది. చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆ భార్య కోర్టు మెట్లెక్కింది. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే.. గుజరాత్ లోని వడోదరకు చెందిన ఓ మహిళకు(28), అదే గ్రామానికి చెందిన వ్యక్తి(30) తో ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారినపడి వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన అవయవాలన్నీ దెబ్బతినడం వలన బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను వదిలి వెళ్లిపోతాడనే మాట విన్న భార్య కుదేలయిపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. భర్త ప్రేమను చిరకాలం పొందాలనుకొని సంకల్పించింది. తమ బంధం, ప్రేమ అన్యోన్యతకు గుర్తుగా బిడ్డ రూపంలో భర్తను చూసుకోవాలనుకొని భర్త వీర్యాన్ని ఇవ్వాల్సిందిగా వైద్యులను కోరింది. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించలేదు. చివరికి కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలపడంతో భర్త గుర్తు కోసం ఆమె కోర్టు మెట్లెక్కింది.
గుజరాత్ కోర్టులో ఈ కేసు సంచలంగా మారింది. కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తికి వెంటనే ఆమోదించింది. ఆమె భర్త నుంచి వెంటనే వీర్యం సేకరించి భద్రపరచాలని, ఐవీఎప్ ద్వారా ఆమె గర్భం దాల్చేందుకు సహకారం అందించాలని ఆస్పత్రికి సూచించింది. దీంతో కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి వర్గాలు ఆమె భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరిచాయి. భర్త పోతే మరొకరిని పెళ్ళిచేసుకోని వెళ్లిపోతున్న ఈ రోజుల్లో భర్త ప్రేమకు గుర్తుగా ఇంతటి సాహసం చేసిన ఆ మహిళను అందరు ప్రశంసిస్తున్నారు.
Follow Disha daily official Facebook page: https://www.facebook.com/dishatelugunews