- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భర్త కోసం 1400 కిమీ నడిచివెళ్లిన భార్య.. షాకిచ్చిన భర్త!
దిశ, వెబ్‌డెస్క్ : భర్త కోసం ఓ భార్య పెద్ద సాహాసమే చేసింది. భర్తను వెతుక్కుంటూ 1400 కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లింది. ఎక్కడ ఉన్నాడో తెలియని పతి కోసం మహా నగరాన్నే జల్లెడ పట్టింది. చివరికి ఆచూకీ తెలుసుకుని అక్కున చేర్చుకుంది. బీహార్ నుంచి పంజాబ్ వరకు నడిచివచ్చిన ఆమెను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.
పాట్నాకు చెందిన 19 ఏళ్ల యువతికి15 ఏళ్లకే వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించాక.. భార్యభర్తలు మధ్య చిన్న వివాదం జరిగింది. దీంతో భర్త అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయన మళ్లీ తిరిగి వస్తాడని నాలుగేళ్లుగా ఎదురు చూసింది. అయినా భర్త రాలేదు. దీంతో ఆమె పిల్లలను ఇంట్లోనే వదిలేసి ఎవరికి చెప్పకుండగా భర్త ఆచూకీ కోసం బయలుదేరింది.
భర్త పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నట్లు మాత్రమే ఆమెకు తెలుసు. అదే ఆధారంతో ఇంట్లో నుంచి ఛార్జీలకు డబ్బులు కూడా తెచ్చుకోకుండా బీహార్ నుంచి కాలినడకన ప్రయాణం సాగించింది. అలా 1400 కిలో మీటర్లు నడిచివచ్చి లూథియానాలో వెతుకులాట ప్రారంభించింది. కానీ అతడి ఆచూకీ కనిపెట్టలేక పోయింది.
ఆమెను స్థానికంగా ఉండే బుద్ధదేవ్ అనే వ్యక్తి గమనించి విషయం ఆరా తీశాడు. మనసు ధ్రవించిపోయిన ఆయన ఆ వివాహితను చేరదీశాడు. ఆమెకు ఆహారం, ఆశ్రయం కల్పించి.. మరుసటి రోజు పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. భర్త ఎక్కడ ఉన్నాడో ఆమె సరైన అడ్రస్ చెప్పలేకపోయింది. అయినా పోలీసులు శ్రమించి అతడి ఆచూకీ తెలుసుకున్నారు. అయితే భార్య వద్దకు వచ్చిన భర్త జాన్.. ఆమె ఎవరో తెలియదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసులు, స్థానిక నాయకులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి ఉండేందుకు అంగీకరించాడు. త్వరలో బీహార్ నుంచి పిల్లలను కూడా తీసుకోచ్చి కలిసి ఉంటామని జాన్ పేర్కొన్నాడు.