పెళ్లైన ఏడు నెలలకే భర్త హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

by Sumithra |
husband Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల నమోదైన మిస్సింగ్ కేసు విషాధంగా మారింది. నెల రోజుల తర్వాత అతడు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. రెండవ భార్యే భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు ధ్రువీకరించారు. పోలీసుల కథనం ప్రకారం..

వనస్థలిపురానికి చెందిన గగన్ అగర్వాల్(38) రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. 2020 జూన్‌లో నౌసిన్ బేగం(మరియాద) అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో ఏమైందో తెలియదు కానీ ఫిబ్రవరి 8న గగన్ అగర్వాల్ అదృశ్యమయ్యాడు. అతడి మిస్సింగ్ పై భార్య నౌసిన్ బేగం, మరిది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. గగన్ అగర్వాల్ హత్యకు గురైనట్లు తేల్చారు.

రెండవ భార్య నౌసిన్ బేగమే భర్తను హత్య చేసిందని గుర్తించారు. మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. పెళ్లిన ఏడు నెలలకే భర్తను హత్య చేయడం కలకలం సృష్టించింది. నౌసిన్ బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఆమె ఒక్కతే హత్య చేసిందా..? మరెవరైన పాత్ర ఉన్నాదా?, ఇంతకు హత్య ఎందుకు చేసింది..? అనే కోణంలో పోలీసులు ఎంక్వేరీ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed