తల్లిగారింటి పక్కనే ఉండే వ్యక్తితో వివాహేతర సంబంధం.. బయటపెట్టిన సెల్ ఫోన్

by Sumithra |   ( Updated:2021-10-30 23:29:32.0  )
Affairs1
X

దిశ, వెబ్ డెస్క్: పరాయి స్త్రీ లేదా వ్యక్తి మోజులో పడి చాలామంది దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్ పేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. అతనికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. అతను ప్రతిరోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిగారి ఇంటి పక్కనే ఉండే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఈ సమయంలో అప్పుడప్పుడు ప్రియుడు వచ్చి ఆమెను కలిసి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో భర్తకు అనుమానం వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించిందని, భార్యపై అనుమానం వచ్చి ఆమె సెల్ ఫోన్ తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం.

Advertisement

Next Story