- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కేసీఆర్ నయా రాచరిక పాలన చేస్తున్నారు: భట్టి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అటు మంత్రులను, ఇటు ప్రజలను సీఎం కలవడం లేదనీ..ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నయా రాచరిక పాలన చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రెండేండ్ల పాలన పై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
సెక్రటేరియట్‌లో ఏ శాఖకు ఫోన్ చేసినా ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాళేశ్వరం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎకరాకైనా నీళ్లు పారాయా? అంటూ ప్రశ్నించారు. ఏపీ సర్కార్ చేస్తున్న జలదోపిడీపై ఏనాడైనా సీఎం కేసీఆర్ స్పందించారా? అని అడిగారు. ధరణి వల్ల రాష్ట్రం గందరగోళంలో పడిందని ధ్వజమెత్తారు. తనకు కావాల్సిన వారికోసమే రెవెన్యూ వ్యవస్థను సీఎం గందరగోళం చేశారని చెప్పారు. వ్యవసాయ రంగం మొత్తం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు.