- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మంత్రిగారూ… మా ఊరికి భగీరథ నీళ్లొస్తలేవు’
X
దిశ, హుస్నాబాద్: ‘మంత్రిగారు… మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లొస్తలేవు’ అని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్లపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని పల్లివాగు ఉధృతంగా ప్రహించడంతో వాగు ఒడ్డున ఉన్న బావితో పాటు, దుర్గమ్మబావి ద్వారా గ్రామానికి తాగునీరందించే బావులు కూడా పూర్తిగా నీటమునిగాయన్నారు.
దీంతో బావులలోని నీరు కలుషితం కావడంతో గ్రామంలో తీవ్రమైన నీటికొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని సంబంధిత అధికారులకు చెప్పినా… పట్టించుకున్న పాపానపోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ స్పందించి తాగునీరందించాలని కోరుతున్నారు.
Advertisement
Next Story