కరోనాను ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గం

by Sridhar Babu |   ( Updated:2021-10-01 09:38:20.0  )
vaccination center
X

దిశ, మణుగూరు: కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలని మణుగూరు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గడుపూడి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం కునవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను సర్పంచ్ ఏనిక ప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, అందరూ తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. ఇవాళ(శుక్రవారం) వందమందికి వ్యాక్సిన్ పూర్తి చేశారు. 40 మందికి టీకాలు సరిపడా లేకపోవడంతో బాంబే కాలనీ సెంటర్ నుంచి తెప్పించి పూర్తి చేశారు. ఇదే చైతన్య స్ఫూర్తిని కొనసాగించి, 18 ఏండ్లు నిండిన అందరూ వేయించుకొని, కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Next Story