- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ట్విన్స్ సత్తా.. గూగుల్‌లో ఉద్యోగం
దిశ, ఏపీ బ్యూరో: గూగుల్ జపాన్ సంస్థ ఏపీ కుర్రాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చింది. రూ.50 లక్షల చొప్పన వార్షిక వేతనం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్యాంపర్ ఇంటర్వ్యూలో కవలలైన అన్నదమ్ములు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.50 లక్షలు ఆఫర్ చేసింది కంపెనీ. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇదే అత్యధిక వేతనం. అంతేకాదు ఒకేసారి ఇద్దరు కవలలు సమాన వేతనం పొందడం కూడా ఇదే ప్రప్రథమం కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే అమరావతిలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం-ఏపీ కాలేజీ క్యాంపస్‌లో తొలి బ్యాచ్ బయటకు వస్తోంది. దీంతో కాలేజీలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో విద్యార్థులు పొందిన వేతనం సగటు రూ.7 లక్షలుగా నమోదు అయ్యింది.
కాగా మజుందార్ కవల సోదరులు వేర్వేరుగా రూ. 50 లక్షల వార్షిక వేతనం పొందారు. దీంతో ఇటీవల కాలేజీ యాజమాన్యం వీరిని ఘనంగా సత్కరించింది. కాలేజ్ తరుపున రూ. 2 లక్షల ప్రైజ్ మనీ సైతం ఇచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తామని తమకు నమ్మకం ఉందని కానీ ఇంత స్థాయిలో వేతనం పొందుతామని తాము ఊహించలేదని కవలలో ఒకరైన సప్తర్షి మజుందార్ చెప్పారు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు కలిసే చదువుకున్నామని ఇప్పుడు ఉద్యోగం కూడా ఒకే సంస్థలో పొందడం సంతోషంగా ఉందన్నారు. మెుదటి నుంచి ఒకేచోట కలిసి పనిచేయాలని తాము కలగనేవాళ్లమని అయితే అది ఇంత గొప్పగా నెరవేరుతుందని అనుకోలేదని సప్తర్షి మజుందార్ తన సంతోషం వ్యక్తం చేశారు.