- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: పుట్టా మధుకర్
దిశ, కాటారం: ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన చావు డప్పు మోగింది. సోమవారం కాటారం మండల కేంద్రంలోని ఎర్రబెల్లి అంబేద్కర్ కూడలిలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, టీఆర్ఎస్ యువజన నాయకుడు జక్కు రాకేష్, మండల శాఖ అధ్యక్షుడు తోట జనార్ధన్ ల నేతృత్వంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల తోనే వరి ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని అన్నారు.
వానాకాలం ధాన్యం కొనుగోలు పై అయోమయం సృష్టిస్తూ యాసంగి బియ్యం కొనమని గందరగోళం సృష్టిస్తున్న కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల తీరుకు నిరసనగా మంథని నియోజకవర్గంలో గ్రామగ్రామాన చావు డప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ యువజన నాయకుడు జక్కు రాకేష్ , కాటారం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు తోట జనార్ధన్, గారేపల్లి సింగిల్విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు, కొడుదుల రాజబాబు, ఎలుబాకా సుజాత, శ్రీ లక్ష్మి, జోడు శ్రీనివాస్ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.