- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
దిశ సూర్యాపేట: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ, రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి చెట్లను నరికి వేస్తూ ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారులు నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.
నిర్లక్ష్యంగా అధికారులు..
ఇప్పటికే రాష్ట్రంలో 33 శాతం ఉన్న అడవులను పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ హరితహారాన్ని నీరు కారుస్తూ సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారాని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలను వినియోగించే గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికి వేస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు.
అధికారులకు నెలవారీ మామూళ్లు..?
నియోజకవర్గంలో కలప అక్రమ రవాణా స్మగ్లర్ అజ్ఞాతంలో ఉంటూ ఎవరికీ కనిపించకుండా (ఇతర ప్రాంతంలో) ఉంటూ తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పిస్తున్నట్లు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లు కి అలవాటు పడ్డ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో కలప రవాణా స్మగ్లర్ది ఆడిందే ఆట పాడిందే పాట లాగా తమ దందాను మూడు పూలు ఆరు కాయలు లాగా కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాసులు కురిపిస్తున్న దందా..
వేప, తుమ్మ చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. పంట చేలు గుట్టల ప్రాంతాలోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేలకులుస్తున్నారు. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాళ్ల చొప్పున అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేత పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
దళారులపై చర్యలు తీసుకోవాలి..
మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చెట్టు యొక్క ఆవశ్యకతను వివరించాలి. చెట్లను నరికివేసిన కారణంగా భవిష్యత్తులో మరిన్ని కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా చెట్లను సంరక్షించాలి.
-పల్లపు నాగరాజు, సీతానగరం