- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకాతో మరణం ముప్పు దాదాపు శూన్యం- కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కరోనా మరణాలతో పోల్చితే టీకా వల్ల మరణం ముప్పు దాదాపు శూన్యమని, దాన్ని ఉపేక్షించవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 16 నుంచి జూన్ 7వ తేదీ మధ్యలో టీకా తీసుకుని 488 మంది మరణించారన్న మీడియా కథనాలను కొట్టిపారేసింది. ఆ కాలంలో 23.5 కోట్ల డోసులను పంపిణీ చేశామని వివరించింది. వాటితో పోల్చితే టీకా తీసుకున్నవారిలో మరణించింది 0.0002 శాతమని వివరించింది. కానీ, వీరంతా టీకా తీసుకుని వికటించిన కారణంగా మరణించారనుకోవడం తప్పని పేర్కొంది. ఆ స్థాయి జనాభాలో అన్ని మరణాలు సంభవించడం సాధారణమేనని తెలిపింది.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం, 2017లో ప్రతి వెయ్యి మందిలో ఏడాదికి 6.3 శాతం మరణించారని వివరించింది. టీకా పాజిటివ్ తేలిన వారిలో ఈ రేటుతో పోల్చితే మరణాలు ఒక శాతం ఎక్కువగా చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నదని, అందులో ఆ ఒక్క శాతాన్ని టీకా పంపిణీ ద్వారా నివారించవచ్చునని తెలిపింది. మీడిమా కథనాల్లో వాస్తవం లేదని, టీకా తీసుకున్నంత మాత్రానా అనంతరం మరణించిన వారంతా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారని పేర్కొనరాదని వివరించింది.