తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌లు బదిలీ

by Shyam |
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌లు బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను సోమవారం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా ఉన్న పి.ప్రావీణ్యను వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా వెయిటింగ్‌లో ఉన్న టీఎస్ దివాకర్‌ను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న రిజ్వాన్ బాషను ఆదిలాబాద్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉన్నది.

Advertisement

Next Story