బడిలోనే బీరు, బిర్యానీ.. బట్టలు కూడా విప్పాలా? అని అడిగిన టీచర్

by Ravi |   ( Updated:2021-03-26 07:29:16.0  )
బడిలోనే బీరు, బిర్యానీ.. బట్టలు కూడా విప్పాలా? అని అడిగిన టీచర్
X

దిశ, వెబ్ డెస్క్: ఉపాధ్యాయుడంటే విద్యార్థులని మంచి మార్గంలో నడిపించేవాడు. అలాంటి ఉపాధ్యాయుడు బడినే బారుగా మార్చుకొని విద్యార్థలను చితకబాదటం, బూతులు మాట్లాడటం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఏకంగా పాఠశాలలో మద్యం సీసా, బిర్యానీతో విద్యార్థలకు దర్శనమిచ్చాడు. ఈ దుర్భర సంఘటన పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురంలో ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వరరావు కుప్పంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బదిలీపై రెండు నెలల క్రితం కృష్ణాపురంలో ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. వచ్చిన దగ్గరనుండి టీచర్ ప్రవర్తన విచిత్రంగా ఉంది. పాఠశాలకు మద్యం సేవించి రావడం, విద్యార్ధులపై చేయి చేసుకోవడం లాంటివి చేస్తుండడంతో ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి కొందరు విద్యార్థలు తల్లిదండ్రులకు చేరవేశారు.

దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు వచ్చి మద్యం సేవిస్తున్న ఉపాధ్యాయున్ని ఇదేంటి? అని ప్రశ్నించగా దానికి అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా మద్యం సీసా చూపుతూ.. దుస్తులు కూడ తీయాలా అంటూ వెక్కిరిస్తూ మాట్లాడారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. డీఇఓ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిని విధులనుంచి తొలిగించారు.

Advertisement

Next Story