బయటకు వస్తే వాహనాలు సీజ్.. కోర్టుకు వెళ్లాలంటున్న డీజీపీ

by Shyam |
బయటకు వస్తే వాహనాలు సీజ్.. కోర్టుకు వెళ్లాలంటున్న డీజీపీ
X

దిశ, కూకట్ పల్లి: లాక్ డౌన్ నిర్వహణపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం కూకట్ పల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూకట్ పల్లిలోని పలు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లు, లాక్ డౌన్ ప్రక్రియను, లాక్ డౌన్ నిబంధనలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఆంక్షలను కఠినతరం చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఉదయం 10గంటల నుంచి మరసటి రోజు ఉ.6 గంటలవరకు రాష్ట్రసరిహద్దులు మూసివేయాలన్నారు. బోర్డర్ దాటి రాష్ట్రంలోకి రాకుండా, బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని సూచించారు. రాత్రి 8 గంటల నుంచి ఉ.6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతివ్వాలని తెలిపారు. అదేవిధంగా సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎసీపీ సురేందర్ రావులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed