స్పుత్నిక్-వీ టీకాకు గ్రీన్ సిగ్నల్

by Anukaran |   ( Updated:2021-04-12 05:17:04.0  )
స్పుత్నిక్-వీ టీకాకు గ్రీన్ సిగ్నల్
X

న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను భారత్‌లో వినియోగించడానికి దాదాపు ఆమోదం లభించినట్టే. మనదేశంలో ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఎస్ఈసీ), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ సంస్థ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎస్ఈసీ సిఫారసను డీసీజీఐ అనుమతించడమే తరువాయి. ఇప్పటి వరకు మన దేశంలో పంపిణీకి భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్, సీరం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాకు డీసీజీఐ అత్యవసర అనుమతినిచ్చింది. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ, మైక్రోబయాలజీ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాను తయారీతోపాటు మనదేశంలో పంపిణీకి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ ఆర్‌డీఐఎఫ్‌తో డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొడెర్నా, ఫైజర్‌ల తర్వాత స్పుత్నిక్ వీ టీకాకు అత్యధిక సామర్థ్యం(91.6శాతం) ఉన్నదని ఫలితాలు తేల్చాయి.

Advertisement

Next Story

Most Viewed