మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

by Sridhar Babu |
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లి హత్య
X

దిశ, కరీంనగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాటారం సీఐ హథీరాం వివరాల ప్రకారం మహాముత్తారం మండలం యామన్‌పల్లికి చెందిన మధుకర్ మద్యానికి బానిస అయ్యాడు. గ్రామంలో జులాయిగా తిరుగుతుండేవాడు. దురలవాట్లు, ఏ పనిచేయకపోవడంతో విసుగు చెంది మొదటి భార్య విడాకులు తీసుకుంది. అయితే, మధుకర్ రెండో పెండ్లి చేసుకున్నాడు. కానీ, ఎలాంటి మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి రాజమ్మతోపాటు ఉంటున్నాడు. గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని మధుకర్ అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. క్షణికావేశంతో రోకలితో రాజమ్మ తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags: mother, killed by son, not give to money, for alcohol,

Advertisement

Next Story

Most Viewed