- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విషాదం: తల్లి మరణించిన 24 గంటల్లోనే కొడుకు మృతి
దిశ, హుజూర్‌నగర్: కరోనా రక్కసి ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకును బలి తీసుకున్న విషాద సంఘటన హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. జాన్ పహాడ్ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మీనారాయణ (45) గత 15 రోజుల జ్వరం క్రితం వస్తుండగా అది తగ్గకపోవడంతో నేరేడుచర్ల పిహెచ్ సికి వెళ్లి కరోనా టెస్టు చేయించుకోగా అందులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. తనతో పాటు ఉంటున్న కుటుంబ సభ్యులైన భార్య, కూతురు, తల్లి, అన్నకు కూడా కరోనా టెస్ట్ చేయగా వారికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.డాక్టర్లు లక్ష్మీనారాయణను ఐసోలేషన్ సెంటర్లలో ఉండాలని మిగిలిన కుటుంబ సభ్యులను ఇంట్లోనే హోకోరైంటెమ్ లో ఉంటుా మందులు వాడాలని సూచించారు.
లక్ష్మీ నారాయణను ఐసోలేషన్ లో భాగంగా హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో మందులు వాడుతున్న లక్ష్మీనారాయణ తల్లి సీతారామమ్మ(68) ఆదివారం సాయంత్రం శ్వాస ఆడక ఇబ్బంది పడటంతో ఆమె నల్లగొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తన సొంత గ్రామమైన జాన్ పహాడ్ తీసుకువచ్చి ఆమె అంత్యక్రియలు పూర్తి చేసిన 24 గంటల్లోపే ఆమె కొడుకు లక్ష్మీనారాయణ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తల్లి, కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. లక్ష్మీనారాయణను బ్రతికించుకునేందుకు హాస్పిటల్లో 10 లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. లక్ష్మీనారాయణ మండలంలోని ఒక ఫ్యాక్టరీలో ప్రవేటు ఉద్యోగం చేస్తున్నాడు.