- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరితహారం లక్ష్యం 12.5 కోట్ల మొక్కలు
దిశ, న్యూస్‌బ్యూరో: ఆరో విడత హరితహారంలో 12.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెల 25నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో ముందుగా నిర్దేశించుకున్న 2.5 కోట్ల మొక్కలు కాకుండా లక్ష్యాన్ని మార్చారు. బుధవారం మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 6నెలల్లో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 500 యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ పార్కులు, 700 ట్రీ పార్కులు ప్రజానీకానికి అందుబాటులో ఉండాలన్నారు. మూడు, నాలుగు నెలల్లో పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో ప్రఢవిల్లే విధంగా మియావాకి నమూనాలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలని, మున్సిపాలిటీల్లో ట్రీ పార్కులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో 5కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో రెండున్నర కోట్ల మొక్కలు, సీడీఎంఏ(మున్సిపాలిటీలు) పరిధిలో 5కోట్ల మొక్కల చొప్పున లక్ష్యాన్ని విధించారు. హరితహారంలో తక్కువ కాలంలో ఎక్కువ గ్రీనరీకి అవకాశం కల్పించే మియావాకి, ట్రీ పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్వారీలు, డంప్ యార్డుల చుట్టూ ‘కీ రోల్’ పద్ధతిలో గ్రీనరీ పెంపకాన్ని చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లు బాలకృష్ణ, శివశరణప్ప, సిడిఎంఏ అడిషనల్ డైరెక్టర్ పంకజం, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(బయో డైవర్సిటీ) కృష్ణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.