- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LAC వద్ద ఉద్రిక్త వాతావరణం -ఆర్మీ చీఫ్
దిశ, వెబ్ డెస్క్: భారత-చైనా సరిహద్దు LAC వద్ద ఉద్రిక్తంగా ఉందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. మన జవాన్లు ధైర్యంగా ఉన్నారని, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
“నేను నిన్న లేహ్ చేరుకున్న తరువాత పరిస్థితిని సమీక్షించాను. మన జవాన్ల మనోధైర్యం ఎక్కువ. వారు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను సందేహం లేకుండా చెప్పగలను మన సైనికులు ఉత్తమమని. వారు ఆర్మీనే కాదు దేశం మొత్తం గర్వించేలా చేస్తారు. LAC వెంట పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కానీ మేము దీని గురించి ప్రతిక్షణం ఆలోచిస్తూ… కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము” అని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నిర్వానే తెలిపారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో భారత్-చైనా సరిహద్దులో యుద్ధం మొదలవనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా యాప్ లను బ్యాన్ చేయడంతో ఆ దేశానికి ఆర్ధికంగా నష్టం వాటిల్లింది. గతంలో భద్రతాభంగం వాటిల్లుతోందని… చైనా యాప్ లపై భారత్ నిషేదాజ్ఞలు విధించడంతో అమెరికా సహా పలు దేశాలు ఇదే ఫాలో అయ్యాయి. తిరిగి అదే దుస్థితి ఎదురవనుంది అని చైనా అంతర్మధనం చెందుతోంది.
డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు చైనా ప్రభుత్వానికి మింగుడు పడట్లేదు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకుందామంటూనే సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా ఆర్మీ. సరిహద్దు నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకొస్తోంది. దీంతో మన సైన్యం కూడా అడుగులు ముందుకేస్తోంది. ఈ నేపథ్యంలో LAC వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏం జరగనుందో వేచి చూడాలి.