హీరోయిన్‌గా మెరవబోతున్న భారత్ స్టార్ బౌలర్ సోదరి

by Shyam |
హీరోయిన్‌గా మెరవబోతున్న భారత్ స్టార్ బౌలర్ సోదరి
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, టీమ్ ఇండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ సోదరి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. వృత్తిరీత్యా మోడల్ అయిన మాల్తీ చాహర్.. స్వయాన పేస్ బౌలర్ దీపక్ చాహర్ చెల్లి. మాల్తీ చాహర్ మోడలే కాకుండా 2104 ఫెమినా మిస్ ఇండియాలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా మాల్తీ చాహర్ ‘letsmarry.com’ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. మాల్తీ చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా అభిమానులను కలిగి ఉంది. దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో కలిసి చేసిన ఒక మ్యూజిక్ వీడియోలో నటించిన మాల్తీ చాహర్ వెలుగులోకి వచ్చింది. దీపక్ చాహర్‌తో కలిసి సోషల్ మీడియాలో నిత్యం ఫొటోలను పంచుకుంటుంది. ఇదే సమయంలో సినీ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Advertisement

Next Story