నవంబర్ 1న కలెక్టరేట్ల ముట్టడి

by Shyam |
నవంబర్ 1న కలెక్టరేట్ల ముట్టడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్ 1న కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని చెబుతున్నారని, మరి ఏ పంట వేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు. కనీసం వ్యవసాయ ప్రణాళిక లేదన్నారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రణాళికల ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతుందని ఆరోపించారు. ఒకసారి సన్నాలు వేయాలని.. ఇంకోసారి మొక్కజొన్న వేయవద్దని అంటూ రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. వరి పండే భూముల్లో ఇతర పంటలు పండవని, ఏ పంట ఎప్పుడు వేయాలి… ఎక్కడ వేయాలి అన్నది రైతులకు స్పష్టత ఉందన్నారు. కానీ సిద్దిపేట కలెక్టర్ ఒకవిధంగా… వ్యవసాయ మంత్రి మరొకవిధంగా… మంత్రి హరీష్ రావు ఇంకో విధంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పొంతనలేని ప్రకటనలు మానుకొని రైతులు ఏ పంట వేయాలో స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed