- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐకెపి సెంటర్లో భారీ గోల్ మాల్.. వేల రూపాయలు..
దిశ, పరకాల: హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని కాట్రపల్లి ఐకెపి సెంటర్లో జరిగిన అక్రమాల పై ‘కొనుగోలు లీలలు’ పేరుతో దిశ పత్రిక లో వార్త కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమాలపై విచారణ జరపాలని కాట్రపల్లి సర్పంచ్ ఒంటెరు వనమ్మ భర్త ఒంటెరు వీరస్వామి సంబంధిత అధికారులను కోరాడు. కాట్రపల్లి ఐకెపి సెంటర్ నిర్వాహకులు అజ్మీరా వనమ్మ కొడుకు అజ్మీరా రఘుసింగ్ కొంతమంది బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడ్డాడని, కొంతమంది రైతుల పేర్లు వినియోగించుకొని తన అకౌంట్లో నగదు జమాయ్యేలా చేసుకున్నాడు అని తెలిపారు.
నేను కాట్రపల్లి ఐకెపి సెంటర్ కి 84 బస్తాలు అమ్మితే నాకు 158592 రూపాయలు శాయంపేట ఎస్బిఐ అకౌంట్లో పడ్డాయి. కానీ నాకు తెలియకుండానే నా పేరు ఉపయోగించుకొని ఆత్మకూరు కెనరా బ్రాంచిలో 1325108013318 అకౌంట్ లో 67968 రూపాయలు పడినట్టు 90 బస్తాలు అమ్మినట్టు రికార్డులో క్రియేట్ చేయడం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.