చెట్ల పొదల్లో ఏకాంతంగా గడుపుతుండగా బట్టలు మాయం.. అలాగే వెళ్లిపోయిన యువతి

by Shyam |   ( Updated:2021-10-31 01:45:12.0  )
Dress-1
X

దిశ, సినిమా: భూమి మీద మనుషులుగా పుట్టాక కాలానికి అనుగుణంగా మార్పును స్వాగతిస్తూనే ఉన్నాం. అనాగరిక అలవాట్లను వదిలించుకుంటూ మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాం. ఇలాంటి ఎన్నో మార్పులు, నూతన ఆవిష్కరణలకు సాక్షులుగా నిలుస్తున్నా.. ఆకలి, దాహం మాదిరే మనిషికి సెక్స్ ఓ ప్రాథమిక అవసరంగానే కొనసాగుతోంది. కానీ ఆదిమ సమాజపు అలవాట్లను పక్కనబెడితే, పరిణామ క్రమంలో కట్టుబాట్లు.. విచ్చలవిడి శృంగార సంబంధాలపై నియంత్రణ విధించాయి. ఈ మేరకు సమాజం భార్యాభర్తల నడుమ శృంగారానికే ఆమోదం తెలిపింది. బలవంతపు సెక్స్‌ను ఎదుర్కొన్న మహిళలు తమకు నచ్చిన శృంగార భాగస్వామిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆర్థిక, అధికార బలమున్న చోట మాత్రం మహిళలు సెక్స్ బానిసలుగానే మగ్గిపోయారు. ఇదిలా ఉంటే, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఓ మహిళ ఉద్యమం కోసం లైంగికతను ఎలా వాడుకుంది? ఆడ, మగ మధ్య నిజమైన ప్రేమ.. కామం, త్యాగం రెండింటిలో దేన్ని కోరుకుంటుంది? మగాళ్ల ప్రేమ భాగస్వామి శరీరంపైనేనా? అనే అంశాలను మూడు తరాలకు చెందిన కథల ద్వారా వివరించే ప్రయత్నమే ‘ఆనం, పెన్నం’ ఆంథాలజీ. స్త్రీ, పురుషుల మధ్య లైంగిక సంబంధాల్లో వచ్చిన మార్పును ఆవిష్కరించింది.

సావిత్రి..

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో కేరళలో జరిగిన కమ్యూనిస్టు పోరాటాలను అణచివేసేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నించారు. ఈ పోరాటంలో యాక్టివ్‌గా పాల్గొ్న్న కమ్యూనిస్టు మహిళ కథే ‘సావిత్రి’. పోలీసుల నిర్బంధం కొనసాగుతుండటంతో సావిత్రి తన ఐడెంటిటీని దాచిపెట్టి ఒక జమిందారీ ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. వెట్టిచాకిరీ చేస్తూ పరిస్థితులు సద్దుమణిగేవరకు అక్కడే ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలోనే తనపై మోజుపడ్డ ఇంటి యజమాని.. కోరిక తీర్చమని వేధిస్తుంటాడు. అందుకు ఓ డెడ్ లైన్ విధిస్తాడు. తన భార్య చూస్తుండగానే సావిత్రిని వంకరచూపులు చూస్తూ కళ్లతోనే కామిస్తుంటాడు. అయినా ఆ ఫ్యామిలీలోని మహిళలు.. మగాళ్ల చర్యలను ప్రశ్నించే సాహసం చేయకపోవడం అప్పటి పోకడలను చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంటికి వచ్చిన మరో యువకుడికి తన ఐడెంటిటీ తెలిసిపోవడంతో.. విషయం బయటపడకుండా ఉండేందుకు అతని కోరిక తీరుస్తుంది. ఫైనల్‌గా యజమాని విధించిన గడువు తేదీ రావడంతో అతను చెప్పిన చోటుకు వస్తూనే కమ్యూనిస్టు సభ్యులకు సమాచారం అందిస్తుంది. వారు అక్కడికి చేరుకుని యజమాని చంపేస్తారు. అదే టైమ్‌లో సావిత్రితో గడిపిన యువకుడు అడ్డుపడితే తుపాకీతో బెదిరించి వెళ్లిపొమ్మని తన పోరాట మార్గంలో వెళ్లిపోతుంది.

* ఇక్కడ తమ పోరాటాన్ని నిలుపుకునేందుకు తన శరీరాన్ని ఆయుధంగా మలచుకుని యువకుడి కోరికను తీర్చిన సావిత్రి.. అదే పోరాటానికి హాని కలుగుతుందంటే చంపేందుకైనా వెనకాడలేదు. కాగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ స్టోరీకి జేకే దర్శకత్వం వహించారు.

రాచియమ్మ..

కేరళలోని టీ ఎస్టేట్స్‌లో జాబ్‌లో చేరిన కుట్టికృష్ణణ్ అనే యువకుడు అక్కడే పాలు పోసే అమ్మాయి రాచియమ్మతో పరిచయం అవుతుంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న తనకు రాచియమ్మనే అన్ని విషయాల్లో సాయపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తెలియని చనువు ఏర్పడుతుంది. ఖాళీ సమయంలో అక్కడి కొండ ప్రాంతంలోని ప్రకృతి మధ్య ఏకాంతంగా గడపడం అలవాటు. ఓసారి రాచియమ్మ కూడా అదే ప్లేస్‌కు వెళ్తుంది. అక్కడ వారిద్దరూ పక్కపక్కనే కూర్చున్నప్పుడు కుట్టి తనతో సన్నిహితంగా మెలగడాన్ని అర్థం చేసుకున్న రాచియమ్మ.. తను అలాంటి పనులు చేయనని దేవుడికి మొక్కుకున్నానని చెప్తుంది. దీంతో నొచ్చుకున్న కుట్టి.. జాబ్ మానేసి వెళ్లిపోతాడు. 11 ఏళ్ల తర్వాత తన ఫ్యాక్టరీ యజమాని చనిపోయాడని తెలిసి మళ్లీ వస్తాడు. ఈ సమయంలోనే రాచియమ్మ గుర్తొచ్చి చూసేందుకు వెళ్తే షాకింగ్ నిజం తెలుస్తుంది. కుట్టి తనను విడిచి వెళ్లాక మనసు మార్చుకున్న రాచియమ్మ.. అప్పటి నుంచి తనకోసమే ఎదురుచూస్తూ ఒంటరి జీవితం గడుపుతోందని తెలిసి బాధపడతాడు.

* కుట్టికి పెళ్లి అయిందని తెలిసి కూడా రాచియమ్మ మరో మగాడిని తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఇష్టపడలేదు. తనకు అలవాటైన ఒంటరి జీవితాన్నే గడుపుతూ తను సంపాదించిన డబ్బంతా కుట్టి కూతురు విజయలక్ష్మికే అని చెప్పడం.. ప్రేమ త్యాగాన్ని కూడా ఇష్టంగా భరిస్తుందని నిరూపించింది. 1969లో ప్రముఖ రచయిత ఉరూబ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ స్టోరీకి వేణు దర్శకత్వం వహించాడు.

రాణి..

ప్రేమలో ఉన్న యంగ్ కపుల్.. సెక్స్ కోసం చోటుచేసుకున్న సన్నివేశాలను ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. భారతీయ పురుషుల్లో లైంగిక సంబంధాలపై ఉన్న స్టీరియోటైపిక్ పద్ధతిని చూపించింది. ఈ స్టోరీ విషయానికొస్తే.. తన లవర్‌తో సెక్స్ అనుభవించేందుకు బాయ్‌ఫ్రెండ్ తపిస్తుంటాడు. తాముంటున్న ప్లేస్‌లో ఏకాంతంగా గడపడం వీలు కాదని, ఎవరైనా చూస్తారని, సిటీకి దూరంగా కొండ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమెను ఒప్పిస్తుంటాడు. కానీ ప్రజెంట్ జనరేషన్‌కు చెందిన ఆ యువతి.. నీకు కావాలనుకున్నది పబ్లిక్‌గా చేసినా నాకేం ప్రాబ్లం లేదంటూ వాదిస్తుంది. అందుకు భయపడ్డ యువకుడు మొత్తానికి ఎలాగోలా ఆమెను ఒప్పించి కొండ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అయితే అక్కడ తాము సెక్స్‌లో పాల్గొనే ముందు ఆ అమ్మాయి.. నా శరీరం ఇష్టమా? నేనంటే ఇష్టమా? అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలకు అతడు కవితాత్మకంగా జవాబు చెప్పడంతో యువతి ఇంప్రెస్ అవుతుంది. ఇక తమ దుస్తులను విప్పేసి బైక్ పెట్టిన ఆ జంట.. పక్కనే ఉన్న పొదల్లోకి చేరి ఏకాంతాన్ని అనుభవిస్తారు. తిరిగి వెళ్లిపోబోతుంటే వారి బట్టలు మాయమవుతాయి. అబ్బాయి ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే.. అమ్మాయి మాత్రం ధైర్యంగా నేను ఇలాగే వెళ్తా.. ఇకపై నీ ఇష్టం అంటూ వెళ్లిపోతుంది. ఇంతకీ వాళ్ల బట్టలు ఎలా మాయమయ్యాయి? వారు ఇంటికి ఎలా వెళ్లారనేది స్టోరీ..

* ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు తాము చేస్తున్న పనిమీద ఎంత క్లారిటీగా ఉంటారనేందుకు ఇదొక ఉదాహరణ. సాధారణంగా శృంగారం విషయంలో మహిళలు చురుకుగా ఉండటాన్ని సంప్రదాయ సమాజం ఆమోదించదు. కానీ రాణి స్టోరీలో యువతి.. సమాజం ఏం అనుకుంటుందో అనే స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేసినట్లు చూపించారు. ఈ స్టోరీని ఆశిక్ అబూ డైరెక్ట్ చేశారు.

– సంతోష్ దామెర

Advertisement

Next Story

Most Viewed