- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకప్పటి స్వర్గధామం ఈ ఎర్రటి సరస్సు.. ఎక్కడుందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ ఉర్మియా సరస్సు.. ఒకప్పుడు అరుదైన పక్షులు, స్నానాలకు స్వర్గధామం. కానీ, ఇప్పుడు దాని పేరు ఎక్కడా వినిపించడం లేదు. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఉప్పు సరస్సుగా పేరుగాంచిన ఉర్మియా.. ఫ్లెమింగో, పెలికాన్, ఎగ్రెట్ వంటి పక్షులకు నివాసంగా ఉండేది. ఏకంగా 102 ద్వీపాలను కలిగిన ఉన్న ఈ సరస్సు తరతరాలుగా పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇచ్చింది.
పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నేపథ్యంలో సరస్సు ఆనకట్టు, భూగర్భజలాల ద్వారా నీటిని వెలికితీయడంతో రాను రాను నీటి సాంధ్రత తగ్గిపోయింది. ఉప్పు నీటితో కూడిన ఈ సరస్సు ఒకప్పుడు సహజ రంగు నీలం అయినప్పటికీ.. క్రమంగా క్షీణిస్తూ కొన్ని సమయాల్లో ఎరుపులోకి మారుతోంది. నీటి మట్టాలు తగ్గడం, ఆల్గే అనే బ్యాక్టీరియా నీటిలో పెరగడంతో ఇలా రంగు మారుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాతావరణ మార్పులు, కరువులు సంభవించడంతో 1980లో సరస్సు ఏకంగా 80 శాతం తగ్గిపోయింది. దీనికి ప్రతిఫలంగా పర్యాటక ప్రాంతం కాస్తా ఏడారిగా మారింది. ఈ వేసవిలో ఉర్మియా పూర్తిగా ఎరుపు రంగులోకి మారడంతో నీటిలో ఆడే చివరి తరం అవుతుందనే భయాలను 2018లో మరింతగా పెంచింది. సరస్సు అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం గతంలోనే భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో పురోగతి జరగలేదు. ప్రతిఫలంగా చెరువు నీలి రంగులోకి రావడం కలగానే మిగిలిపోయింది.
తాజాగా, ఉర్మియా సరస్సు, అందులో ఆడుతున్న పర్యాటకులను డ్రోన్‌తో తీసిన చిత్రాలను గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (CGTN) సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. 2013లో ప్రభుత్వం చేపట్టిన చెరువు పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా 2020 చివర్లో సానుకూల ప్రతిఫలాలు వచ్చినట్టు ప్రచురించింది. ప్రస్తుతం ఉర్మియా సరస్సు పునరుజ్జీవనాన్ని ప్రజలు స్వాగిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ సరస్సుకు సంబంధించిన తాజా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Drone photos show locals bathing, playing and fording water on Tuesday in Lake Urmia, one of the most extensive hypersaline lakes in the world situated in the mountains of northwestern Iran, as a 10-year rehabilitation program, including efforts to alleviate drought, continues. pic.twitter.com/YdqiCn9hYe
— CGTN (@CGTNOfficial) July 9, 2021