Pulivendula: ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి ప్రశ్నల వర్షం

by srinivas |
Pulivendula: ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి(Kadapa MP Avinash Reddy PA Raghava Reddy)కి విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల(Obscene posts)కు సంబంధించిన కేసులో ఆయనకు ఆరు రోజులుగా విచారణ కొనసాగుతోంది. వర్రా రవీంద్రర్ రెడ్డి(Varra Ravindra Reddy)తో అసభ్య పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.

తాజాగా పులివెందుల డీఎస్పీ కార్యాలయం(Pulivendula DSP Office)లో రాఘవరెడ్డికి విచారణ(investigation) జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పోలీసుల ఎదుట హాజరైన ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. ఇందుకు రాఘవరెడ్డి సైతం సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

కాగా వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు అయినప్పటి నుంచి రాఘవరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల పులివెందులలో ప్రత్యక్షం కావడంతో రాఘవరెడ్డికి నోలీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రాఘవరెడ్డిని ఇప్పటికే ఐదుసార్లు ప్రశ్నించారు. తాజాగా ఆరోసారి కూడా విచారణ చేపట్టారు. ఇదే కేసులో రాఘవరెడ్డి అనుచరుడు పవన్ కుమార్‌(Pawan Kumar)ను కూడా విచారించారు.

Advertisement

Next Story

Most Viewed