- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime : టిప్ తక్కువ ఇచ్చిందని.. గర్భిణిపై 14 సార్లు కత్తితో దాడి
దిశ, నేషనల్ బ్యూరో : టిప్ విషయంలో గొడవ గర్భిణిపై 14 సార్లు కత్తి పోట్లకు దారి తీసింది. ఈ ఘటన అమెరికా సెంట్రల్ ఫ్లొరిడాలో గురువారం తీవ్ర కలకలం రేపింది. దీంతో పిజ్జా డెలీవరి చేసే మహిళ బ్రియన్నా అల్వెలోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓసియోలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణీ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. డెలీవరి చేసేందుకు వచ్చిన అల్వెలోకు 33.10 డాలర్ల బిల్లు కాగా.. 50 డాలర్లు చెల్లించింది. అందులో మిగిలిన డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. పాలసీలో భాగంగా తాము చిల్లర ఇవ్వలేమని అల్వెలో ప్రెగ్నెంట్ లేడీతో తెలిపింది. దీంతో గర్భిణీ మహిళ తన బాయ్ ఫ్రెండ్ వద్ద నుంచి చిల్లర తీసుకుని అల్వెలోకు ఇచ్చింది. అందులో 2 డాలర్లు అల్వెలోకు టిప్ రూపంలో దక్కాయి. తర్వాత అల్వెలో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత గర్భిణీ కుటుంబం హోటల్ రూమ్‌లో నిద్రిస్తుండగా వచ్చి డోర్ కొట్టింది. అనంతరం ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు గర్భిణీ భాయ్ ఫ్రెండ్‌ను బాత్ రూమ్‌కు వెళ్లాలని బెదిరించారు. అనంతరం గర్భిణీపై 14 సార్లు కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో గర్భిణీ మహిళ 5 ఏళ్ల కూతురు సైతం తనతోనే ఉంది. గర్భిణీ ఊపిరితిత్తులకు గాయం కాగా సర్జరీ చేశారు. అల్వెలోపై అటెంప్ట్ మర్డర్ కేసును పోలీసులు నమోదు చేశారు.