ఆ భారాన్ని మోయలేకపోతున్న రైతులు.. ఇలా అయితే వ్యవసాయం చేసేదెలా..?

by Sridhar Babu |   ( Updated:2021-06-21 00:51:45.0  )
formers news
X

దిశ, ధర్మపురి : ప్రస్తుత ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులు ఎక్కువగా యాత్రికంపై ఆధార పడడంతో రైతులపై మోయలేనంత ఆర్థిక భారం పడి రైతులు అతలాకుతలం అవుతున్నారు. సరియైన పశుగ్రాసం దొరకక, ఇతర కారణాలతో రైతులు తమ పశువులను పోషించలేని స్థితిలో వాటిని అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం పంటలకు సిద్దమైన రైతులు ఎద్దులతో దుక్కి దున్న లేకపోవడంతో అధిక శాతం ట్రాక్టర్లపై ఆధారపడుతున్నారు. ఆధునిక వ్యవసాయం వల్ల రైతులు యంత్రాల అద్దె మోయలేనంత భారంగా మారింది.

గంటకు రూ.1000 పైనే..

ప్రస్తుత వివిధ పరిస్థితుల వల్ల రైతులకు పశువుల పోషణ భారం ఎక్కవ కావడంతో వాటిని పోషించే స్థితి లేక, చేసేది ఏమి లేక తమ పశువులను విక్రయిస్తున్నారు. ఈ విధంగా పశువుల సంతతి దిన దినం తగ్గడంతో వ్యవసాయంకు కాడెడ్లను ఉపయోగించే అన్నదాతలు ప్రస్తుతం యంత్రాలతో వ్యవసాయం చేయడంతో వాటి అద్దె అన్నదాతలకు పెద్ద భారంగా మిగిలి పోతున్నది. ప్రస్తుతం ట్రాక్టర్ల యజమానులు రైతుల వద్ద గంటకు రూ. 1000 నుండి 1200 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. రైతులకు గత్యంతరం లేక ఆ అద్దె భారాన్ని మోస్తూ ట్రాక్టర్లను వినియోగించుకోక తప్పడం లేదు. ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ధరలకు తోడు వ్యవసాయ కూలీల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న ఖర్చులు..

వ్యవసాయంలో రోజు రోజుకు యాంత్రికరణ వినియోగం పరుగుతున్నది. వ్యసాయ పనుల్లో దాదాపు అన్ని పనుల్లో ట్రాక్టర్​ వినియోగం ఎక్కవగా పెరిగింది. గతంలో గ్రామంలో ఒక ట్రాక్టర్​ ఉండేది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో పదులు సంఖ్యలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా రాయితీలపై ట్రాక్టర్లను యంత్రాలను అందజేస్తున్నారు. దీనితో వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించే కాడెడ్ల ప్రాధాన్యత పూర్తిగా తగ్గుతూ వస్తున్నది. గతంలో గ్రామాల్లో వంద శాతం ఎడ్లతో వ్యవసాయం చేస్తుండే వారు. ప్రస్తుతం 50 శాతం కూడా ఎడ్లను కూడా వినియోగించడం లేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యవసాయ యంత్రాలకు రూ. 100 నుండి 300 వరకు పెరిగాయి. గత ఏడాది కల్టివేటర్​కు రూ. 800 వందలు ఉండగా ఇప్పుడు రూ. 1000 వరకు పరిగాయి. రోటివేటర్ గత ఏడది రూ. 900 ఉండగా ఇప్పుడు 1100 వరకు పెరిగాయి. గతేడాది విత్తనాలు వేయడానికి ఒక బ్యాగుకు రూ. 600 వందలు ఉండగా ఇప్పుడు 800 పెరిగాయి. మహిళ కూళీలకు రూ. 300 వందల నుండి 400 కాగా పురుషులకు దాదాపు 500వరకు పెంచారని రైతులు వాపోతున్నారు.

ఆర్థిక భారమైనా తప్పడం లేదు..

యంత్రాల ద్వారా పంటలు వేయడం అధిక భారమైనా తప్పడం లేదు. కూలీల కొరత, పశువులను పోషించే స్తోమత లేక ఎడ్లను అమ్మడంతో ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పనులు చేయవల్సి వస్తున్నది.

మహేష్​ రైతు

వాట్ ఎన్ ఐడియా.. విత్తనం ఎండిపోవద్దని..

Advertisement

Next Story