మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఆ పని చేయలేదని బట్టలు విప్పి అరాచకం

by Shyam |   ( Updated:2021-09-09 02:06:18.0  )
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఆ పని చేయలేదని బట్టలు విప్పి అరాచకం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. కరోనా తగ్గిందని ఫిజికల్ క్లాస్ లు ప్రారంభించిన నేపథ్యంలో జూనియర్ లను సీనియర్స్ వేధించడం ప్రారంభించారు. తమపై జరుగుతున్న వేధింపులపై కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలిపారు. వారు కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. సీనియర్స్ కళాశాల రికార్డ్ లు రాయాలని, రాయకపోతే బట్టలు విప్పి వేధించినట్లు తెలిసింది. కరోనాకు ముందు సైతం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులపై ర్యాగింగ్ ఆరోపణలు వచ్చాయి. ర్యాగింగ్ నేపథ్యంలో కళాశాలలో యాంటి ర్యాగింగ్ కమిటీ డ్యూటీలను యాక్టివ్ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. ఇందిరా తెలిపారు. అసలు కళాశాలలో ర్యాగింగ్ జరుగలేదని, జూనియర్స్ మీడియా ముందుకు ఎందుకు తీసుకువచ్చారో తెలియడంలేదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Advertisement

Next Story

Most Viewed