14 ఏండ్ల క్రితం పోయింది.. ఇప్పుడు దొరికింది

by Shamantha N |
14 ఏండ్ల క్రితం పోయింది.. ఇప్పుడు దొరికింది
X

దిశ, వెబ్‌డెస్క్: కార్లు, బైక్‌లు పోతేనే దొరకని కాలమిది. ఒక్కసారి పోతే మళ్లీ దొరుకుతుందన్న నమ్మకం యజమానులకే ఉండదు. ఖరీదైన మొబైల్ ఫోన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇక పర్సుల విషయానికొస్తే చెప్పనవసరం లేదు. అందులో ఉన్నడబ్బులు తీసుకొని మిగతావి పక్కన పడేస్తారు దొంగలు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అంతగా ఫలితం ఉండదు. కానీ, 14 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి పొగొట్టుకున్న పర్సు అతడికి ఇప్పుడు దొరికింది.

వివరాళ్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ వ్యక్తి 2006లో తన పర్స పోగొట్టుకున్నాడు. అయితే, ఎంత వెతికిన దొరకలేదు. చివరకు చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చాడు. ఆ తర్వాత తన పనిలో తాను బిజీ అయ్యాడు. నెలలు కాదు సంవత్సాలు గడిచాయి. తీరా 14 ఏళ్లు అయిన తర్వాత అతడికి స్టేషన్ నుంచి కాల్ వచ్చింది.

మీ పర్సు దొరికింది తీసుకెళ్లండి అని చెప్పండంతో వెంటనే స్టేషన్‌కి వెళ్లాడు. అప్పట్లో ఆ పర్సులో తొమ్మిది వందలు ఉండగా.. స్టాంపు డ్యూటీల కింద వంద కట్ చేసుకొని పోలీసులు మూడు వందలు మాత్రమే ఇచ్చారు. నోట్లు మారిన సందర్భంగా ఒక 5 వందల నోటు ఉండడంతో మార్చి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా పోయిన పర్సు పద్నాలుగేళ్ల తర్వాత దొరకడం గగనమే.

Advertisement

Next Story

Most Viewed