- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేరా హుకుం..వినకుంటే ఖతం..ఓ టీఆర్ఎస్ నాయకురాలి దౌర్జన్యం..!
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : దుకాణదారుడిని దుకాణం మూసివేయాలని ఓ టీఆర్ఎస్ నాయకురాలు హుకుం జారీ చేసింది… దానికి సమాధానంగా ఆ దుకాణదారుడు నువ్వేమన్నా అధికారివా.. అని ప్రశ్నించాడు.. దీంతో చిరెత్తుకొచ్చిన సదరు టిఆర్ఎస్ నాయకురాలు తన అనుచరులతో ఆ వ్యాపారిపై దాడి చేసిన ఘటన బేగం బజార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… బేగం బజార్ లో వికాస్ అనే వ్యాపారి దాల్ మండిలో ఫ్లై వుడ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవల కరోనా కేసులు పెరిగిపోతుండడంతో స్థానికంగా దుకాణాలను సాయంత్రం ఐదు గంటల వరకే తెరచి ఉంచాలని వ్యాపారుల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూడా దుకాణం తెరచి ఉంచడాన్ని గమనించిన గోషామహల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శాంతిదేవీ ప్లై వుడ్ దుకాణం వద్దకు మరో నలుగురుతో కలిసి చేరుకుంది.
వెంటనే దుకాణం మూసి వేయాలని హుకుం జారీ చేసింది. దీంతో దుకాణ యజమాని నీవేమన్నా అధికారివా? దుకాణం మూసి వేయాలని చెప్పడానికి నీవెవరు అంటూ ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన శాంతిదేవీ అనుచరులతో కలిసి దుకాణ యజమానిపై దాడి చేశారు. నేను చెప్పినా దుకాణం బంద్ చేయవా ? నన్నే ప్రశ్నిస్తావా అంటూ దుకాణాదారునిపై దాడి చేయడంతో పాటు నానా హంగామా సృష్టించారు. దీంతో దుకాణాదారుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలలో ఆధారాలు సేకరించి శాంతిదేవీతో పాటు ఆమె అనుచరులు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శాంతి దేవి కూడా వికాస్ పై ఫిర్యాదు చేశారని బేగంబజార్ ఇన్ స్పెక్టర్ తెలిపారు .