డివైడర్‌ను ఢీ కొన్న బస్సు

by srinivas |
road accident
X

దిశ, వెబ్ డెస్క్ : లారీని తప్పించే ప్రమాదంలో డివైడర్‌ను బస్సు ఢీకొంది ఈఘటన తూర్పగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు సమీపంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై వెళ్తున్న కంటెయినర్ ను లారీ ఢీకొట్టింది. అదే సమయంలో విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద వెలికి తీశారు. గాయపడిన ప్రయాణకులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed