- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాంప్ పేపర్ @రూ.1000
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లో రూ.20 విలువ చేసే స్టాంప్ పేపర్ రూ.వెయ్యి ధర పలుకుతోంది. ఎన్నికల వేళ నామినేషన్లకు అవసరమైన అఫిడవిట్ కోసం పోటీ చేసే అభ్యర్థులు స్టాంప్ పేపర్లను రూ.వెయ్యి చెల్లించి కూడా తీసుకున్నారనేది సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్ పేపర్ల కొరత తీవ్రంగా ఉంది. రెండున్నర మాసాలుగా రిజిస్ట్రేషన్లు బంద్ చేయడంతో ఉన్న స్టాంప్ పేపర్లు పలు రకాల పనులకు అమ్ముడు పోయాయి. రిజిస్ట్రేషన్లు లేని కారణంగా చాలా కార్యాలయాల్లోనూ లిమిటెడ్ గానే నిల్వ చేసుకున్నారు. అయితే, గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రతి అభ్యర్థికి స్టాంప్ పేపర్ అవసరం ఏర్పడింది. నగరంలో ఎన్నికల వేళ పోటీ చేసే వారు నామినేషన్ వేయాలంటే స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉన్నది. దీంతో పోటీ చేసేందుకు సిద్దమైన ప్రతీ ఒక్కరు స్టాంప్ పేపర్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయాల్లో కూడా పెద్దగా నిల్వ చేయలేదు. దీంతో నిలువ ఉన్న పేపర్లు విల్ డీడ్, మ్యారేజెస్ లకు సరిపోయాయి. అదనంగా డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయాల్లోనూ లేకపోవడంతో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
బ్లాక్ లో విక్రయం..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల నేపథ్యంలో స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. నగరంలో సుమారు 11 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. రిజిస్ట్రేషన్లు లేని కారణంగా వాటిపై పెద్దగా దృష్టి పెట్టలేదని ఇటు అధికారులు, అటు డాక్యుమెంట్ రైటర్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చాలా మంది బ్లాక్ లో కొనుగోలు చేశారు. రూ. 20 విలువ పేపర్లను ఎన్నికల్లో పోటీచేసే వారు తమ అవసరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించి తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు తుది గడువు 20వ తేదీతో ముగియనుండడంతో శుక్రవారం ఒక్క రోజే కనీసంగా 1000 స్టాంప్ పేపర్లు అభ్యర్థులు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో స్టాంప్ పేపర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటి కనీసంగా రూ.వెయ్యికి విక్రయించినట్టు తెలుస్తోంది.